ఈ అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అని… ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేసారు. నేటి అర్ధరాత్రి నుంచి 21 రోజులు లాక్ డౌన్ ఉంటుందని ఏప్రిల్ 14 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగుతుందని అన్నారు. ఈ 21 రోజులు బయటకు వెళ్ళడం అనేది ప్రజలు మరచిపోవాలని మోడీ ఈ సందర్భంగా కోరారు. ఇది ప్రతీ ఇంటికి లక్ష్మణ రేఖ అని మోడీ అన్నారు. ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం అని మోడీ స్పష్టం చేసారు. ఈ 21 రోజులు మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం తర్వాత మన చేతుల్లో ఉండదు అన్నారు.
ప్రజలు అందరూ ఇళ్ళల్లో ఉండి కరోనా మీద పోరాటం చెయ్యాలని ఆయన సూచించారు. ప్రతీ ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని మోడీ విజ్ఞప్తి చేసారు. ఇల్లు విడిచి ఎవరూ బయటకు రావొద్దని ఆయన కోరారు. కరోనాపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా పోరాడుతున్నాయని, జలుబు దగ్గు ఉంటే ఎవరూ కూడా మందులు వాడవద్దని వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు.
వైద్యుల సలహా లేకుండా ఎవరూ ఎలాంటి మందులు వాడవద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. ఇది జనతా కర్ఫ్యూ కంటే గొప్పదని అన్నారు. కరోనా వ్యాప్తిని మనం టీవీ లో చూస్తూనే ఉన్నాయని కరోనా కట్టడి చెయ్యాలి అంటే సోషల్ డిస్టెన్స్ చాలా కీలకమని, ఒక వ్యక్తి ద్వారా కరోనా వేల మందికి వస్తుందని అన్నారు. కరోనా ఎదుర్కోవడానికి గాను 15 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నామని అన్నారు.
ఏ అవసరం ఉన్నా సరే ప్రజలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దు అని ఆయన కోరారు. కరోనా అంటే ఎవరూ రోడ్ల మీదకు రావొద్దు అని అర్ధమని అన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా మనకు సవాల్ చేస్తూనే ఉందని ప్రధాని మోడీ గా చెప్పడం లేదని ప్రతీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా అన్నారు. మెడికల్, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని అన్నారు. వదంతులు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేసారు.
ఏ మాత్రం అనుమానం ఉన్నా సరే వైద్యులను కలవాలని ఆయన కోరారు. సమర్ధవంతంగా పని చేస్తున్న పోలీసులకు మీడియాకు ధన్యవాదాలు చెప్పారు మోడీ. దయచేసి ప్రజలు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఇళ్ళ నుంచి బయటకు రావాలి అని ఆలోచన్ వద్దని అన్నారు. ఇటలీ లో ఎం జరుగుతుందో చూస్తున్నామని, జర్మని, ఇరాన్ కరోనా వైరస్ ని అడ్డుకోలేకపోతున్నాయని మోడీ హెచ్చరించారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని అన్నారు.