ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ను అభినందించిన ప్రధాని మోదీ

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ US ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందారు. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023లో దాస్ ‘A+’ రేటింగ్ పొందారు. ఏ ప్లస్ ర్యాంకు ముగ్గురికి లభించగా, ఆ ముగ్గురిలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు.

PM Modi hails Indian Railways' increase in harnessing of solar power, ET  Infra

రెండో స్థానంలో స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, మూడో స్థానంలో వియత్నాం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎన్గుయెన్ థి హాంగ్ నిలిచారు. ఈ విషయాన్ని ఆర్బీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. శక్తికాంత దాస్ కు అరుదైన ఘనత దక్కడం పట్ల ఎంతో సంతోషిస్తున్నామని పేర్కొంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. “ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుభాభినందనలు. భారతదేశానికి ఇవి గర్వించదగిన క్షణాలు. శక్తికాంత దాస్ కు లభించిన ఘనత ప్రపంచ వేదికపై మన ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తోంది. శక్తికాంత దాస్ అంకితభావం, దార్శనికత దేశ పురోగతి తీరును మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నాను” అంటూ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news