కోర్టు తీర్పును అమలు చేస్తారనే నమ్మకం ఉంది : డీకే అరుణ

-

తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ వికాస్‌రాజ్‌ను బీజేపీ జాతీయాధ్యక్షురాలు డీకే అరుణ కలిశారు. వికాస్ రాజుకు హైకోర్టు తీర్పును కాపీని అందజేశారు. హైకోర్టు ఆర్డర్ కాపీని అసెంబ్లీ స్పీకర్, సెక్రెటరీని కలిసి అందించేందుకు అసెంబ్లీకి వచ్చానని డీకే అరుణ అన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక వారిద్దరూ అందుబాటులో లేరని ఆమె పేర్కొన్నారు. స్పీకర్‌కు నిన్న, ఇవాళ ఉదయం కాల్ చేశానని, అయినా లిఫ్ట్ చేయలేదని ఆమె తెలిపారు. ఇక ప్రతిరోజు 10 గంటలకు ఆఫీస్‌కు వచ్చే సెక్రెటరీ కూడా ఈరోజు ఆఫీస్‌కు రాలేదని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

DK Aruna: 'వచ్చేది మన ప్రభుత్వమే.. చూసుకుందాం'.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై డీకే అరుణ సంచలన కామెంట్స్.. - Rtvlive.com

దీంతో ఆర్డర్ కాపీని వాళ్ల ఆఫీస్‌లో అందజేసినట్లు చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తన అధికారాలను ఉపయోగించి వెంటనే ఈ ఆర్డర్‌ను ఇంప్లిమెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె కోరారు. హైకోర్టు తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల ముందు ఈ తీర్పు వచ్చి ఉంటే నియోజకవర్గం అబివృద్ధి జరిగేదని ఆమె వెల్లడించారు. ఆలస్యమైనా తీర్పు వచ్చింది కాబట్టి వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి డీకే అరుణ నేరుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌ను వెళ్లి కలిశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు పత్రాలను అందించి తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని వికాస్ రాజ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. కోర్టు తీర్పును అమలు చేస్తారనే నమ్మకం తనకుందని డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, త్వరలోనే పరిశీలించి సమాచారం ఇస్తానని వికాస్ రాజ్ చెప్పారని ఆమె మీడియాకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news