BREAKING : ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌కు ప్రధాని మోదీ

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను వచ్చే ఏప్రిల్ 8న ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ పనులను శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ రానున్నట్లు వెల్లడించారు. మరోవైపు అదే రోజు సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారని, ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

అటు తెలంగాణపై బిజెపి అధిష్టానం దృష్టి సారించింది. ఆ పార్టీ అగ్ర నేతలు తరచు రాష్ట్రానికి వస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు సంగారెడ్డికి రానున్నారు. అక్కడ బిజెపి జిల్లా ఆఫీస్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచే వర్చువల్ గా మన జిల్లాల కార్యాలయాలను ఓపెన్ చేస్తారు. శంషాబాద్ లో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్ ల సమావేశం నిర్వహిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version