టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కు ప్రధాని మోదీ లేఖ

-

భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కి ప్రధాని నరేంద్ర మోడీ ఓ లేఖ రాశారు. ఆ లేఖను జడేజా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. 2015 వ సంవత్సరంలో జడేజా – రివాబాను వివాహం చేసుకున్నారు. వారికి 2017 వ సంవత్సరంలో కూతురు జన్మించింది. కాగా జడేజా తన ముద్దుల కూతురుకు “నిద్యాన జడేజా” అని నామకరణం చేశారు. అయితే ఇటీవల నిద్యాన తన ఐదవ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా రవీంద్ర జడేజా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో 101 మంది పేద చిన్నారులకు అకౌంట్లు తెరిపించాడు. అందులో ఒక్కొక్కరికి రూ. 11 వేల రూపాయలు జమ చేశాడు. దీని గురించి సమాచారం ఇస్తూ జడేజా సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశాడు. ” ఈరోజు ( జూన్ 8) నా కుమార్తె అయిదవ పుట్టినరోజు సందర్భంగా నా భార్య రివాబా జడేజా సంజా గొప్ప పని చేయాలని నిర్ణయించుకుంది. జాంనగర్ పోస్ట్ ఆఫీస్ లో 101 మంది సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిపించాను.

మా కుమార్తె పుట్టినరోజున ఈ పని చేయడం మాకు సంతోషంగా ఉంది. 8 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ నుండి మేము ఈ స్ఫూర్తిని పొందాము.” అంటూ పేర్కొన్నాడు. అయితే ఈ విషయంపై ఆగస్టు 1 న ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జడేజాకు లేఖ విడుదలైంది. దీంతో జడేజా అభినందన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news