ACHARYA : మెగా ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్‌.. ”ఆచార్య” మూవీ వాయిదా

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తాజా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా… .. మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు.

ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్లు, పోస్టర్లు సినిమా పై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇలాంటి తరుణంలో… మెగా ఫ్యాన్స్‌ కు ఊహించని షాక్‌ ఇచ్చింది ఆచార్య చిత్ర బృందం. ఫిబ్రవవరి 3 వ తేదీ 2022 లో విడుదల కావాల్సిన ఆచార్య సినిమా ను తాము వాయిదా వేసుకుంటున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలోనే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టురు కూడా వదిలింది.