రైతులకు PM న్యూఇయర్ గిఫ్ట్.. అకౌంట్లో డబ్బులు

-

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించడానికి రెడీ అవుతోంది. నరేంద్ర మోడీ పీఎం కిసాన్ యోజన పథకం కింద కొత్త ఏడాదిలో జనవరి నెలలో పిఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి మార్చి కాలానికి సంబంధించి రూ. 2 వేల అన్నదాతకు లభించాల్సి ఉంది.

ఈ డబ్బులు త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా, చాలా మంది ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రయోజనాలని పొందుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ సంవత్సరం కూడా రైతులకి రూ. 6 వేలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు విడతలుగా ఈ డబ్బులు ఇస్తున్నారు.

ఇక ఈ స్కీమ్ లో డబ్బులు రానివారు ఇలా చేయండి

ముందు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
ఇప్పుడు ఫార్మర్ కార్నర్‌పై క్లిక్ చేయండి.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చెయ్యండి.
e-KYC, భూమి వివరాలు ఫిల్ చేసున్నాయో లేదో చూడండి.
పేరు కనిపించక పోతే మీకు డబ్బులు రావని అర్ధం.
భూమి రికార్డుల వెరిఫికేషన్, e-KYC చేయకుంటే ఈ డబ్బులు అందవు. కనుక వీటిని చూడండి. సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 కి సంప్రదించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news