ఈ ప్రభుత్వ స్కీమ్ తో.. వడ్డీ లేకుండానే రూ.50 వేల లోన్…!

-

బ్యాంకుల నుండి లోన్ తీసుకుంటే వడ్డీ చెల్లించాలి. బ్యాంకులకు సరైన సమయానికి కట్టకపోతే భారం పడుతుంది. లోన్ భారం పడుతుందని సామాన్యులు వడ్డీ రేట్లు అధికంగా ఉండడం తో చాలా మంది లోన్ తీసుకునేందుకే వెనకడుగు వేస్తూ వుంటారు. అయితే ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకు రావడం జరిగింది. కానీ వాటి గురించి చాలా మందికి తెలీదు. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం స్వానిధి యోజన ఒకటి. ఈ స్కీమ్ వలన చక్కటి ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇక మరి ఈ స్కీమ్ వివరాలని చూసేద్దాం.

పీఎం స్వానిధి యోజన స్కీమ్:

పీఎం స్వానిధి యోజన ద్వారా జీరో వడ్డీ తో రుణాలు ఇస్తోంది కేంద్రం. సుమారు రూ.50,000 వరకు రుణాలు ఈ స్కీమ్ కింద వస్తాయి. సరైన సమయానికి తిరిగి లోన్ కట్టేస్తే మరిన్ని ప్రయోజనాలని పొందొచ్చు. ఒకవేళ కనుక సమయానికి కట్టేస్తే మరోసారి లోన్ ఎక్కువ ఇస్తారు.

పీఎం స్వానిధి యోజన స్కీమ్ వలన కలిగే లాభాలు:

లోన్ చెల్లింపుల్లో రాయితీ కూడా ఇస్తారు.
సరైన సమయానికి తిరిగి లోన్ కట్టేస్తే మరిన్ని ప్రయోజనాలని పొందొచ్చు.
ఈ పథకం 2024 డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానుంది.
తొలి, రెండో దఫా లోన్లుగా రూ.10,000, రూ.20,000గా కేంద్రం నిర్ణయించింది.
మూడో దశ కింద రూ.50వేల వరకు లోన్ ఇస్తారు.
సరైన సమయానికి చెల్లిస్తే 7 శాతం సబ్సిడీ వస్తుంది.
సమయంలోపు లోన్ తిరిగి చెల్లిస్తే ప్రభుత్వం నుంచి మళ్ళీ లోన్ వస్తుంది. మీ రుణ సదుపాయము రెండింతలవుతుంది.

పీఎం స్వానిధి యోజన స్కీమ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్:

ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్, ఓటర్, రేషన్ కార్డులని తీసుకు వెళ్ళాలి.
అలానే బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ ఫోటో కావాలి.

పీఎం స్వానిధి యోజన స్కీమ్ కోసం ఎలా ధరఖాస్తు చేసుకోవాలి…?

పీఎం స్వానిధి అధికారిక వెబ్‌సైట్ www.pmsvanidhi.mohua.gov.in లోకి వెళ్లి లాగ్ ఇన్ అవ్వాల్సి వుంది.
ఆ తర్వాత అక్కడ కనిపించే లోన్ అమౌంట్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news