ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే తాజాగా ఐపీఎల్ 18వ సీజన్లో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో 10 జట్లకు భారత క్రికెట్ బోర్డ్ హెచ్చరికలు జారీ చేసింది. 5 హాట్ ఫేవరేట్ టీమ్ ప్రాంచైజీలను కాంటాక్ట్ చేసినట్లు బీసీసీఐ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలో ఆధారాలు ఇవ్వాలని పోలీసులు బీసీసీఐని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మ్యాచుల్లో ఫిక్సింగ్ కి పాల్పడే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ హెచ్చరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా పలు జట్లకు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐసీసీ, బీసీసీఐ, స్థానిక క్రికెట్ క్లబ్లతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఐదుగురు వ్యాపారవేత్తలపై పోలీసులు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.