రోడ్డు మీదకు వచ్చిన వాళ్లకు హారతి ఇచ్చిన పోలీసులు…!

-

బయటకు రావొద్దు నాయనా అంటే వినే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. పోలీసులు ఏ స్థాయిలో తాట తీస్తున్నా సరే జనం మాత్రం మారడం లేదు. లాఠీ దెబ్బలకు ఎక్కడో ఒకరు చచ్చిపోయారన్నా, పోలీసులు కేసులు పెడుతున్నా సరే ఎవరూ కూడా మారడం లేదు. అయితే ఇలా కాదు అని భావించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కాస్త వినూత్నంగా ఆలోచించే ప్రయత్నం చేసారు.

రోడ్డు మీదకు పనీ పాటా లేకుండా వచ్చిన వాళ్లకు హారతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాన్పూరులోని కిద్వాయ్ నగర్‌లో లాఠీచార్జీలకు బదలు హారతి పళ్లేలు పట్టుకుని… హారతి ఇచ్చి ప్రసాదం కూడా పంచిపెట్టారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారు అందరిని కాన్పూర్ పోలీసులు వరుసగా లైన్ లో నిలబెట్టారు. ఒక పోలీసు హారతి పళ్లెం పట్టుకుని మంత్రాలు చదువుతూ… అక్షింతలు వేస్తూ ముందుకి వెళ్ళారు.

మరో పోలీసు అధికారి ప్రసాదంగా అరటి పండు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. భారత్ లో మాత్రమే ఇలాంటి వింతలు చూస్తామని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరి కొందరు అయితే బట్టలు పెట్టి పంపాల్సింది అని ఎద్దేవా చేయడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ లో కేసులు రెండు వేలకు చేరువలో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news