చెన్నైలో అక్రమంగా తరలిస్తున్న 10 కోట్ల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు చెందిన సొమ్ముగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పల్లికొండ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నగదును కారు నుండి లారీ లోకి మార్చుతుండగా పట్టుకున్నారు పోలీసులు.
48 బండల్స్ గా పేర్చిన10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో కేరళకు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు, చెన్నైకి చెందిన ఒకరు, కోయంబత్తూరుకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారు వెనుక పాపులర్ అనే స్టిక్కర్ ఉండడంతో ఇది వారికి సంబంధించిన నగదుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు వేలూరు క్రైమ్ పోలీసులు.