ఉక్రెయిన్లోని జపొర్జియా నగరంపై రష్యా భీకర దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 23 మంది మరణించగా, మరో 28 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ ఓ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న యుద్ధం మరో భారీ విధ్వంసానికి దారితీసింది. నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను ప్రజాభిప్రాయం మేరకు అధికారికంగా ఇవాళ తమ దేశంలో కలిపేసుకుంటున్నట్టు రష్యా ప్రకటించింది. విలీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా సారథ్యంలోని నాటో ఘాటుగా హెచ్చరించినా.. రష్యా తగ్గడం లేదు. ఉక్రెయిన్లోని దొనెత్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను అధికారికంగా రష్యాలో విలీనం చేసుకునే కార్యక్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని అధికార ప్రతినిధి డిమిత్ర పెస్కోవ్ తెలిపారు.