కేసీఆర్‌కు అన్ని విషయాలపై క్లారిటీ ఉంది : ఉండవల్లి

-

ఏపీకి చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ సోమ‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ స్వ‌యంగా ఫోన్ చేసి పిలిస్తేనే ఆయ‌న‌తో భేటీ అయ్యాన‌ని వెల్లడించారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ భేటీలో ఎలాంటి పార్టీ గురించి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Live telecast hearing of graft cases: Vundavalli Arun Kumar

కేసీఆర్ ఆహ్వానం మేర‌కే తాను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లాన‌ని చెప్పిన ఉండ‌వల్లి…త‌న‌ను మంత్రి హరీశ్ రావు రిసీవ్ చేసుకున్నాన‌ని వెల్లడించారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌తో త‌న‌ భేటీలో హ‌రీశ్‌తో పాటు మ‌రో మంత్రి, ఓ ఎంపీ పాల్గొన్నార‌ని, తాము చ‌ర్చించుకున్నంత సేపు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా అక్క‌డే ఉన్నార‌న్నారు ఉండవల్లి. అయితే ప్ర‌శాంత్ కిశోర్ చ‌ర్చ‌లో పాలుపంచుకోలేద‌ని, తాము మాట్లాడుకుంటూ ఉంటే ఆయ‌న సాంతంగా విన్నార‌ని తెలిపారు. ఏపీలో అన్ని పార్టీల కంటే బీజేపీనే బ‌ల‌మైన పార్టీ అని ఉండ‌వ‌ల్లి చెప్పారు.

ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలుగానే భావించాల‌ని ఉండవల్లి పేర్కొన్నారు. కేసీఆర్‌కు అన్ని విషయాలపై క్లారిటీ ఉందన్న ఉండవల్లి.. ఈ భేటీలో రాజ‌కీయాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జరిగిందన్నారు. బీఆర్ఎస్ గురించి మాత్రం ప్ర‌స్తావ‌న రాలేద‌న్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాల‌న‌పైనే చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. దేశంలో మోదీ పాల‌న‌ను వ్య‌తిరేకించే వారిలో కేసీఆరే బ‌ల‌మైన నేత‌గా ఉన్నార‌న్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news