కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయమంటే వ్యాపారం కాదు..ఓ సేవా సంస్థ అని అన్నారు.ప్రభుత్వం వద్ద ఖజానా లేకపోవడం వల్లనే కొన్ని పథకాలకు ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు.రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుందన్నారు.
వారు పాలించే రాష్ట్రంలో ఇలాంటి స్కీములు అమలు చేసి మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు.కొద్దిగా ఆలస్యం అయితే గిట్టనివారు, తాడు, బొంగరం లేని నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించే సభలపై కొందరు అలగా జనాలకు మద్యం తాగించి సభలపై పంపడం సరికాదని హెచ్చరించారు.తన నియోజకవర్గంలో ప్రభుత్వ సభలపై..అల్లర్లు చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.