Election Results 2022 : మూడు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులకు షాక్

-

దేశవ్యాప్తంగా ప్రజలంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ దండయాత్ర మామూలుగా లేదు. పంజాబ్ మినహా.. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలను సంపాదించుకుంది.

అన్నింటి కన్నా ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం తెలుస్తోంది. యూపీలో ఇప్పటికే.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. యూపీ బీజేపీ సీఎం అభ్యర్థి యోగీ ఆదిత్య నాథ్ గోరఖ్ పూర్ అర్భన్ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పలు పార్టీల సీఎం అభ్యర్థులకు షాక్ ఇచ్చారు ఓటర్లు.

పంజాబ్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. భదౌర్, చంకౌర్ సాహెబ్ రెండు అసెంబ్లీ స్థానాల్లో చన్నీ వెనుకంజలో ఉన్నారు. ఇక గోవాలో బీజేపీ సీఎంఅభ్యర్థి, ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ వెనుకంజలో ఉన్నారు. సాంక్వెలిన్ స్థానంలో ప్రమోద్ సావంత్ వెనకంజలో ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ప్రస్తుత సీఎం, సీఎం అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామి కూడా వెనుకంజలో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news