ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం… ట్విట్టర్ లో రాహుల్ గాంధీ

-

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఒక్క రాష్ట్రంలో కూడా గట్టిప పోటీ ఇవ్వలేక చతికిలపడింది. పంజాబ్ లో ఇంతకుముందు కాంగ్రెస్సే అధికారంలో ఉన్నా.. గౌరవప్రదమైన స్థానాలు కూడా గెలవలేకపోయింది. ఆప్ ధాటికి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఓడిపోయాడు. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ 18 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత ప్రదర్శించింది. చాలా ఘోరంగా ఓటమి పాలైంది. ఇక యూపీలో 400 స్థానాల్లో పోటీ చేసినా కూడా కేవలం 2 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో చావుదెబ్బ తింది. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఓటమిపై కాంగ్రెెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ప్రజల తీర్పును  గౌరవిస్తాం.. గెలిచిన వారికి అభినందనలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు వాలంటీర్ల కృషికి మరియు అంకితభావానికి నా కృతజ్ఞతలు. మేము దీని నుండి నేర్చుకుంటాము మరియు భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉంటాము.’’ అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news