బాబుకు మిలియన్ డాలర్ల ప్రశ్న!

-

2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని సమస్యలపై సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకవైపు అధికారపక్షం నుంచి వస్తున్న ఒత్తిళ్లు.. ప్రజల్లో ఆ పార్టీ పుంజుకుంటున్న తీరు.. టీడీపీని ఎక్కడికక్కడ నిలువరిస్తున్న విధానం వంటివి.. టీడీపీని కలవరపెడుతున్నాయి. అవి చాలవన్నట్లు సైకిల్ దిగిపోతున్న వారి లిస్ట్ రోజు రోజుకీ పెరిగిపోతుంది.

chandrababu naiduఇటీవలే.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేగింది. వెంటనే బాబు రంగంలోకి దిగి బుజ్జగించడంతో కాస్త పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఇలా బుజ్జగింపులకు లొంగని బ్యాచ్ కూడా పెద్దగానే ఉంది.

తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ తెరమీదికి వచ్చింది. విజయవాడ టీడీపీలో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న నాని.. అందరికీ దూరంగా రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో… వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేయడం.. తన కుమార్తె కూడా పార్టీ తరఫున పోటీ చేయరనే సంకేతాలు పంపండం జరిగిపోయాయి!

ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో మంచి పట్టున్న నాయకుడు ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు కూడా పార్టీకి దూరమయ్యారు. అప్పట్లో బాబుకి రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన పొంగూరు నారాయణ పరిస్థితి దాదాపు అలానే ఉంది. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది అర్థంకాని విషయంగా మారింది. ఆయన పార్టీలో ఉన్నారో.. లేరో బాబుకి కూడా పూర్తిగా తెలియదు.

ఇక వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ వంటి నాయకులు చంద్రబాబు పైనా లోకేష్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసి మరీ పార్టీని వదిలి వెళ్లిపోయారు. జేసీ దివాకర్ రెడ్డి, గల్లా అరుణకుమారిలు యాక్టివ్ పాలిటిక్స్ కు దాదాపు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి పార్టీని బాబుగారు ఎలా బయట పడేస్తారు? వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకూ క్యాండిడేట్లైనా ఫిక్స్ చేయగలుగుతారా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారుతున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news