గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ !

గాంధీ అత్యాచార ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. అడ్మిట్ అయ్యిన మూడు రోజుల తరువాత అక్కా చెల్లెల దగ్గరకి వచ్చిన ఉన్న మహేశ్వర్.. పేషంట్ దగ్గర ఒక్కరే ఉండాలంటూ ఇద్దరినీ వేరు చేశాడు. గాంధీ ఆస్పత్రి లో ఉన్న సెక్యూరిటీ రూం లోకి ఒక బాధితురాలిని తీసుకెళ్లిన ఉమ మహేశ్వర్.. బాధితురాలి ముక్కు కు మత్తు మందు ఉన్న ఖర్చీఫ్ ను పెట్టాడు. దీంతో పాటు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం తో అపస్మారక స్థితిలో కి వెళ్ళింది బాధితురాలు. కొద్ది సేపటి తరువాత స్పృహలో కి వచ్చే సరికి తన ఒంటి పై దుస్తులు లేవని గుర్తించింది బాధితురాలు.

ఔట్ పేషెంట్ వార్డ్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ లో ఉన్నట్టు తెలుసుకున్న బాధితురాలు.. తన పై ఉమ మహేశ్వర్ తో పాటు సెక్యూరిటీ గార్డ్ కూడా లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారించుకుంది. కొద్ది సేపటికి సెక్యూరిటీ గార్డ్ రూం దగ్గరకి వచ్చిన తన సోదరి కుమారుడు అరుణ్.. తన పిన్ని అర్ధ నగ్నంగా ఉండటం చూసి బట్టలు తెచ్చి ఇచ్చాడు.

అక్కడి నుండి నేరుగా తమ స్వగ్రామం కు వెళ్ళిన బాధితురాలు.. తన సోదరి కనిపించకపోవడం తో జరిగిన విషయాన్ని అరుణ్ కు చెప్పింది. సోదరి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో ప్రస్తుతం ఉమా మహేశ్వర్ తో పాటు ఒక సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకునీ విచారిస్తున్నారు చిలకలగూడ పోలీసులు. నిందితులపై 342 ,376(d) , 328 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.