పాత కారణం – కొత్త భయం: హస్తినకు పోయి వచ్చిననూ.. ఆదికి అది పోలేదు!

-

ఏపీ ముఖ్యమంత్రి బాబాయ్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం.. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసినవారిలో టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఒకరు! ఈ క్రమంలో తాజాగా ఆ కేసుపై సీబీఐ విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆదినారాయణ రెడ్డి కాస్త టెన్షన్ ఫీలవుతున్నారంట. దీంతో హస్తినకు పోవాలని భావించారు.. తాజాగా వెళ్లివచ్చేశారు కూడా!

జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి 2004,2009, 2014ల్లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆదినారయణ రెడ్డి. అయితే 2014లో టీడీపీలో చేరిన అనంతరం మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ నే ఎక్కువగా టార్గెట్ చేసేవారు ఆదినారాయణరెడ్డి. ఆ టార్గెట్ కేవలం రాజకీయకోణంలోనే కాకుండా వ్యక్తిగత విమర్శలకు కూడా దిగేవారు. దీంతో… నేడు ఆదికి భయం పట్టుకుందని అంటున్నారు!

వైఎస్ వివేకా హత్య కేేసులో తనను ఎక్కడ ఇరికిస్తారోనన్న భయంతోనే ఆయన వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటీషన్ వేసినట్లుగా చెబుతుంటారు. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదినారాయణరెడ్డిని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ప్రశ్నించింది. దీంతో తాను ప్రభుత్వానికి టార్గెట్ అయ్యానని, ఎప్పుడైనా తనను కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఆదినారాయణరెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు చెబుతున్నారు జమ్మలమడుగు జనాలు!

ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన మాజీ మంత్రుల వరస అరెస్ట్ లతో అలర్టయిన ఆదినారాయణరెడ్డి.. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలను కలసి వచ్చారు. అయినా కూడా అక్కడినుంచి బలమైన స్పందన రాలేదో ఏమో కానీ.. ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలకు దూరంగా బెంగళూరులోని వ్యాపారాలపైనే దృష్టిపెట్టి కాలం గడుపుతున్నారంట. దీంతో.. ఆది హస్తినకు వెళ్లి వచ్చినా భయం పోలేదు అనే కామెంట్లు జమ్మలమడుగు కేంద్రంగా సీమ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news