చైనా ని ఇంటర్నేషనల్ కోర్టు కి ఈడ్చాల్సిందే !

-

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా దేశం వుహాన్ పట్టణం. ఈ ప్రాంతంలో పుట్టిన వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాల ప్రజలను బలి తీసుకుంటుంది. అగ్రరాజ్యం అమెరికాలో అయితే చాలా దారుణంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటలీ మరియు స్పెయిన్ లాంటి దేశాలలో అయితే ఈ వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావడంతో చాలా దేశాలలో లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.China's Doctors, Fighting the Coronavirus, Beg for Masks - The New ...దీంతో కరోనా దెబ్బతో చాలా దేశాలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయి. దీనంతటికీ కారణం చైనా అని చిన్న వైరస్ ఉపయోగించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది అని విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఇంత ప్రమాదకరమైన వైరస్ తన దేశంలో ఉన్న టైమ్ లోనే ప్రపంచ దేశాలను అలర్ట్ చేయకుండా చైనా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నల వర్షం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి.

 

అంతేకాకుండా చైనాలో మరణాల సంఖ్య లక్షల్లో ఉంటే కేవలం మూడు వేలు మాత్రమే చూపించిందని…ఇంత తీవ్రత కలిగిన వైరస్ వల్ల ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది చనిపోతున్నారని దానికి కారణం చైనా అంటూ ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఇంత దారుణంగా వైరస్ తమ దేశాలను అతలాకుతలం చేయడంతో చాలా దేశాలు చైనా నీ ఇంటర్నేషనల్ కోర్ట్ కి ఈడ్చాడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా దీనికోసం ఆల్రెడీ పిటిషన్ రెడీ చేసినట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news