చంద్రబాబే కాదు.. జగన్, కేసీఆర్ కూడా యూపీఏతో కలుస్తారట: జోస్యం చెప్పిన జగ్గారెడ్డి

199

వీళ్లంతా యూపీఏతో కలిసి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారంటూ పెద్ద బాంబు పేల్చారు జగ్గారెడ్డి. అంతే కాదు.. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందంటూ ఆయన తెలిపారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి యూపీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందట. అంతే కాదు.. యూపీఏ కూటమిలోకి మరో రెండు పార్టీలు వచ్చి చేరుతాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.

along with chandrababu, jagan and kcr also support upa says jaggareddy

కేంద్రంలో ఖచ్చితంగా యూపీఏ కూటమి వస్తుందని బల్ల గుద్ది మరీ చెబుతున్న ఈయన.. టీడీపీ యూపీఏకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే చంద్రబాబు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని.. టీడీపీ మద్దతు యూపీఏకేనని స్పష్టం చేశారు.

అయితే.. ఒక్క బాబే కాదు.. వైఎస్సార్సీపీ అధినేత జగన్, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా యూపీఏకు మద్దతు ఇస్తారట.

వీళ్లంతా యూపీఏతో కలిసి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారంటూ పెద్ద బాంబు పేల్చారు జగ్గారెడ్డి. అంతే కాదు.. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందంటూ ఆయన తెలిపారు. మరి.. ఈయన ఏదో ఊరికే అలా మైకు ముందు వాగారా? లేక.. నిజంగానే చంద్రబాబుతో పాటు జగన్, కేసీఆర్ కూడా యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తారా? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.