ఢిల్లీకి వెళ్ళిన అమరావతి రైతులు.. మోడీ, అమిత్ షాతో చ‌ర్చ‌లు

-

నవ్యాంధ్ర రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు, రైతు కూలీలు నిరసన చేపడుతున్న ఆందోళనలు 46వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నా చేస్తున్నారు. మరోవైపు వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే దీక్షలు కూడా 46వ రోజుకు చేరుకున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే మ‌రికొంద‌రు 24 గంటల దీక్ష చేపడుతున్నారు. ఇదిలా ఉంటే నేడు అమ‌రావ‌తి రైతులు దేశ రాజధాని ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాను రైతులు కలవనున్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి అపాయింట్మెంట్ ఖరారు అయిన‌ట్టు స‌మాచారం. అలాగే పది మంది కేంద్ర మంత్రులను క‌లిసి.. మూడు రాజదానులపై ఫిర్యాదు చేయనున్నార‌ని తెలుస్తోంది. ఇక ఏదేమైనా కేంద్రం కూడా దిగిరాని ప‌రిస్థితి వ‌స్తే పార్లమెంట్ ముందు కూడా ఆందోళన చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news