అంబటి, గుడివాడకే పవన్ తో రిస్క్?

-

ఏ కులం నేతలు…ఆ కులం నేతలపైనే విమర్శలు చేయాలనే రూల్ ఏపీ రాజకీయాల్లో బాగా అమలు అవుతుంది. కాపు వర్గం నేతలు…వేరే పార్టీలో ఉండే కాపు నేతలపై విమర్శలు చేయాలి. అలాగే కమ్మ వర్గం నేతలు…వేరే పార్టీలో ఉండే కమ్మ నేతలపై..అలాగే రెడ్డి, బీసీ, రాజులు, ఎస్సీ, ఎస్టీ ఇలా ఏ కులం వారు..ఆ కులం వారినే తిట్టాలి అన్నట్లు రాజకీయం జరుగుతుంది.

ఉదాహరణకు ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎస్సీ నేతలు…జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే..అదే వైసీపీలో అదే వర్గానికి చెందిన నేతలు కౌంటర్లు ఇస్తారు. ఇక చంద్రబాబు గాని, పవన్ గాని విమర్శలు చేస్తే…వారికి కమ్మ, కాపు నేతలతో కౌంటర్లు ఇచ్చేలా చేస్తారు. చంద్రబాబుని తన సొంత సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఏ విధంగా తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఇక పవన్ ని పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, కన్నబాబు లాంటి తిడతారు.

అయితే మొన్నటివరకు పేర్ని, కన్నబాబు, అవంతిలు మంత్రులుగా ఉండి పవన్ పై విమర్శలు చేశారు. ఇప్పుడు మంత్రి పదవులు పోవడంతో ఆ డ్యూటీ అంబటి, గుడివాడ తీసుకున్నారు. ఈ ఇద్దరు మంత్రులు..వారి వారి శాఖలకు సంబంధించి మీడియా ముందుకొచ్చి మాట్లాడేది తక్కువ..పవన్, చంద్రబాబులపై చేసే విమర్శలు ఎక్కువ.

అసలు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి…పెద్దగా తన శాఖ గురించి మీడియాతో మాట్లాడిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. అటు అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు…మరి ఈయన ఏమన్నా పెట్టుబడులు, కంపెనీలు తీసుకురావడంపై మాట్లాడతారా? అంటే అబ్బే అదేం ఉండదు…కానీ పవన్ ని విమర్శించడంలో ముందు ఉంటారు.

అయితే ఇలా పవన్ పై విరుచుకుపడుతున్న ఈ ఇద్దరు మంత్రులకు పవన్ తోనే రిస్క్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ గాని, టీడీపీతో కలిస్తే వీరు గెలుపు చాలా కష్టమైపోతుంది. అందుకే అనుకుంటా టీడీపీతో కలవకుండా పవన్ ని వీరు రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి నెక్స్ట్ ఈ మంత్రుల పరిస్తితి ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news