ప్రపంచంలో మనిషిని రోడ్డుమీద లేకుండా ఇంట్లో కూర్చోబెట్టిన కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా అని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చాలా ప్రమాదకర స్థితిలో ఉంది. రోజుకి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు మరియు మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికా మీడియా మొన్నటి వరకు కరోనా వైరస్ న్యూస్ ని కవర్ చేస్తూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని చెడుగుడు ఆడుకుంది.ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ న్యూస్ ని పక్కన పెట్టి సరికొత్త వార్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అదేమిటంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెల్త్ వార్త గురించి. గత కొన్ని రోజులుగా కిమ్ జోంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయి చికిత్స చేయించుకుంటూ ఆసుపత్రిలో చనిపోయినట్లు అమెరికా మీడియా లో వరుస కథనాలు వస్తున్నాయి. ఇందువల్లనే ఈ నెల 15 న జరగాల్సిన కిమ్-2 సంగ్ జయంతి వేడుకలకు గైర్హాజరైనట్లు ఇలా వరుస కథనాలు వస్తున్నాయి.
డోనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా పనిచేసే సీఎన్ఎన్ అమెరికా మీడియా కూడా ఈ వార్తలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. అయితే వచ్చిన ఈ వార్తల్లో వాస్తవం లేదని ఉత్తర కొరియా ప్రభుత్వం కొట్టిపారేసింది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చాలా కట్టు దిట్టంగా అమలు చేస్తున్నట్లు అందువల్లే అధ్యక్షుడు బయటకు రాలేదని చెప్పుకొచ్చింది. అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య కొన్నేళ్లుగా ప్రచ్చన్న యుద్ధం సాగుతోంది. ఇందువలన అమెరికా మీడియా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం పై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వార్తలు ప్రసారం చేసి ఉండొచ్చని ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎనలిస్ట్ లు అంటున్నారు. ఈ వార్తలు చూస్తున్నా అమెరికన్లు దేశంలో ప్రాణాలు పోతుంటే మీడియాకి ఉత్తరకొరియా వార్తలు అంత ముఖ్యమా అని విమర్శలు చేస్తున్నారు.