కమలదళానికి క్లాస్..అసలు పాయింట్ అదే..!

-

మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…రాష్ట్రంలోని కమలదళానికి గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎవరినైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే…వారికి మద్ధతుగా నిలబడి పోరాటం చేయడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలమవుతున్నట్లు కనిపిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే పెద్ద పెద్ద పాయింట్లని సైతం హైలైట్ చేయడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది.

తాజాగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అమిత్ షా…రాష్ట్రానికి వచ్చారు. షా ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరిగింది. టీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత కీలక నేతలతో షా సమావేశమై..ప్రస్తుత పరిస్తితులని తెలుసుకున్నారు. అలాగే మునుగోడు ఉపఎన్నిక గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా మునుగోడులో గెలిచి తీరాలని, ప్రతి గ్రామానికి, వార్డుకు, డివిజన్‌కు ముగ్గురు సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జిగా నియమించాలని అని తరుణ్‌ చుగ్‌కు, సునీల్‌ బన్సల్‌కు సూచించారు. అదే సమయంలో ఇటీవల అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ అంశంపై బీజేపీ నేతలు ఐకమత్యంగా టీఆర్ఎస్ పై పోరాటం చేయలేదు. రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి అన్యాయంగా సస్పెండ్‌ చేస్తే.. పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. అలాగే ఈటల ఇంటికి వెళ్ళిన షా..అండగా ఉంటామని, దిగులు పడకండి అని హామీ ఇచ్చారు.

అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులు గురించి కూడా షా..బీజేపీ నేతలకు కొన్ని ప్రశ్నలు వేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్న ఆర్టీసీ యూనియన్‌ నేత అశ్వత్థామరెడ్డిని షాకు పరిచయం చేశారు. తెలంగాణ ఉద్యమ కారులు ఎవరూ కేసీఆర్‌తో లేరని, తెలంగాణ ద్రోహులే టీఆర్ఎస్ లో ఉన్నారని బీజేపీ నేతలు..షాకు వివరించారు. మరి అలాంటప్పుడు ఇదే అంశాన్ని ఎందుకు ఎక్కువ హైలైట్ చేయడం లేదని షా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్ర బీజేపీ నేతలకు షా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news