తలకు కొబ్బరి నూనె రాస్తే కరోనా తగ్గుతుందా…?

ఒక పక్కన కరోనాతో ప్రజలు అందరూ కూడా నానా బాధలు పడుతున్న సమయంలో కొందరు చేస్తున్న కార్యక్రమాలు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఒక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జీజీహెచ్ కొవిడ్ వార్డుల్లో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారు. కొబ్బరినూనె తలకు రాసి ప్రార్ధన చేస్తున్న ముఠాలను అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు.

యేసు ప్రార్ధన తో వ్యాధి నయం అవుతుందని హితోక్తులు పలుకుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా మత ప్రచారం తంతు నిర్వహిస్తున్నారు. కొవిడ్ వార్డు తర్వాత అవే ముఠాలు జనరల్..సర్జికల్ వార్డుల్లో కి వెళ్లి కొబ్బరి నూని రాస్తూ ప్రార్ధనలు చేయడం గమనార్హం. కరోనా వ్యాపించే ప్రమాదం ఉండడంతో రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లోనూ మహిళా ముఠాలు యథేచ్ఛగా మత ప్రచారం..ప్రార్ధనలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.