ప్రపంచ వింత : కరోనా కంటే రాజకీయాలు హైలైట్ అవుతోంది కేవలం ఏపీ లోనే ..?

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తో పోరాడటానికి రాజకీయ శత్రువులు అయినా కానీ, చేతులు కలిపి మరి పోరాటం చేస్తున్నారు. మన దేశంలో కూడా కరోనా వైరస్ కట్టడి చేయడంలో మోడీ తీసుకున్న నిర్ణయాలకు సోనియాగాంధీ సూచనలు, మద్దతు కూడా ఇస్తున్నారు. ఇలాంటి విపత్తు అందరం కలిసి ఎదుర్కోవాలని ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని స్వయంగా సోనియాగాంధీ కోరడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్.Vijay Sai Reddy points Chandrababu for the AP floods - tollywoodకరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ చాపకింద నీరులా పెరిగిపోతుంటే వాటిని పట్టించుకోకుండా అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అధికార ప్రతిపక్ష నాయకులు కరోనా వైరస్ తో పోరాడుతుంటే కేవలం ఏపీ లోనే కరోనా కంటే రాజకీయాలనే హైలైట్ చేస్తున్నారు. మనిషి ప్రాణాలు పోతున్నా గానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ప్రస్తుతం ఏపీలో కనబడటం లేదు. ముఖ్యంగా వైసిపి పార్టీ పార్లమెంటు సభ్యుడు సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి, చంద్రబాబు వ్యవహారం పట్ల ఏపీ ప్రజలు విసుగు చెందుతున్నారు.

 

ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టిడిపి నాయకులు విమర్శలు చేస్తుంటే, మరోపక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుని వైసిపి నాయకులు టిడిపి పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇళ్లల్లో లాక్ డౌన్ అయిపోయిన ప్రజలు ఈ రాజకీయ విమర్శలు చేస్తూ విసుగు చెందుతున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన వారిని రాజకీయ నాయకులుగా గుర్తించడం మనం చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఎక్కడా లేని ప్రపంచ వింతలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే ఉన్నాయని అసహనం చెందుతున్నారు. మనిషి ప్రాణం పోతుంటే దాన్ని పట్టించుకోకుండా రాజకీయం చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news