ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ ప్ర‌క‌ట‌న‌

-

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబ‌ర్ 10 న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి కే సిద్ధం అయింది. పోటీ లో ఉండే అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించింది. తాజా గా కాంగ్రెస్ పార్టీ కూడా త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.

ఖ‌మ్మం నుంచి నాగేశ్వ‌ర్ రావు ను మెద‌క్ నుంచి నిర్మ‌లఆ జ‌గ్గారెడ్డి ని, న‌ల్గొండ నుంచి శ్రీ‌నివాస్ రెడ్డిని, వ‌రంగ‌ల్ నుంచి వాసుదేవ రెడ్డిని, నిజామాబాద్ నుంచి మ‌హేష్ కుమార్ గౌడ్ ల‌నె ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. వీరు ఈ రోజు నామినేష‌న్లు వేయ‌నున్నారు. అయితే ఈ ఎన్నిక‌ల‌లో అధికార టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ పోటీ ప‌డ‌నుంది. బీజేపీ ఈ ఎన్నిక‌లో పోటి చేయ‌లేమ‌ని ఇప్ప‌టి కే ప్ర‌క‌టించింది. దీంతో ఈ రెండు పార్టీ ల మ‌ధ్య తీవ్ర మైన పోటీ ఉండ‌నుంది. కాగ ఇప్ప‌టికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లు ఏక‌గ్రీవం అయ్యాయి. మొత్తం 6 ఎమ్మెల్సీ ల‌ను అధికార టీఆర్ఎస్ పార్టీ యే కైవ‌సం చేసుకుంది. కాగ జిల్లాలో జ‌రిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు డిసెంబ‌ర్ 10 జ‌ర‌గ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news