కమలం వైపు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే…ఈ సారి ఎవరు?

-

తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు…బీజేపీలో దూకుడుగా పనిచేస్తున్న ఈటల…చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉంటూ…ఇతర పార్టీల్లో ఉన్న నేతలని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం టచ్ లో ఉన్నారని అంటున్నారు..త్వరలోనే వీరు బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు.

ఇదే క్రమంలో ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్ లో ఉన్నదే ఆరుగురు ఎమ్మెల్యేలు…వారిలో ఎవరు కాంగ్రెస్ వైపు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ 19 మంది ఎమ్మెల్యేలని గెలుచుకుంది…టీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలని గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ కు చెందిన 12, టీడీపీకి చెందిన ఇద్దరు, మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు.

అంటే 12 మంది వెళ్లిపోతే…కాంగ్రెస్ కు ఏడుగురు మిగిలారు…అయితే మొదట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్ నగర్ ఉపఎన్నిక జరిగింది…ఆ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచింది. ఇక కాంగ్రెస్ కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు…తాజాగా ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం రెడీ చేసుకున్నారు.

కోమటిరెడ్డి వెళ్లిపోతే ఐదుగురు ఉంటారు..మరి ఈ ఐదుగురులో కూడా ఒక ఎమ్మెల్యే కమలం పార్టీ వైపు చూస్తున్నారని ఈటల మాటలు బట్టి అర్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి భట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, శ్రీధర్ బాబు మాత్రమే  ఉన్నారు. ఈ ఐదుగురులో కాస్త డౌట్ గా ఉన్నది జగ్గారెడ్డి మాత్రమే…కానీ ఆయన కూడా కాంగ్రెస్ ని వదలను అంటున్నారు. మరి కమలం పార్టీ ఎవరితో టచ్ లోకి వెళ్ళిందో క్లారిటీ రావడం లేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇస్తారేమో.

Read more RELATED
Recommended to you

Latest news