కేసీఆర్‌కు మరో తలనొప్పి….కొంపముంచేలా ఉన్నారుగా!

హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడానికి సి‌ఎం కే‌సి‌ఆర్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో దళితబంధుని తీసుకొచ్చారు. దీని ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం హుజూరాబాద్‌లో జరుగుతుంది. అయితే దళితబంధు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుంచి తమకు కూడా ఏదొక బంధు ఇవ్వాలని బి‌సి వర్గాల్లోనే కులాలు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఇతర వెనుకబడిన వర్గాలు వారు డిమాండ్ చేస్తున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఇటు ప్రతిపక్షాలు సైతం కే‌సి‌ఆర్‌ని ఇరుకున పెట్టడానికి అన్నీ కులాలకు దళితబంధు లాగానే పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్‌లోని మిగిలిన కులాలు ఈ డిమాండ్‌ని పైకి ఎత్తుకున్నాయి. అయితే వారికి ఎలాగోలా సర్ది చెప్పి టి‌ఆర్‌ఎస్ ముందుకెళుతుంది. కానీ ప్రతిపక్షాలు, కుల సంఘాలు మాత్రం సైలెంట్‌గా ఉండటం లేదు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర విదేశీ, పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌గౌడ్‌ సైతం గౌడకులంలోనూ పేదలు ఉన్నారని వారందరికీ గౌడబంధు ఇవ్వాలని కోరారు.

దీంతో హుజూరాబాద్‌లో ఉన్న గౌడ కులం వారు, దీని కోసం మరింతగా ఉద్యమించేలా కనిపిస్తున్నారు. అటు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందు రాష్ట్రంలో బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షల రూపాయలు కేటాయించాలని, లేదంటే హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్‌ని ఓడిస్తామని మాట్లాడుతున్నారు.

అంటే అన్నీ రకాలుగా కే‌సి‌ఆర్‌ని ఎటాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్క దళితబంధుతో కే‌సి‌ఆర్‌కు పెద్ద తలనొప్పి వచ్చేలా ఉంది. ఏదైనా ఎమౌంట్ వేలల్లో ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. ఏకంగా స్కీమ్ కింద పది లక్షలు ఇవ్వడంతోనే రచ్చ మొదలైంది. మొత్తానికి దళితబంధు, కే‌సి‌ఆర్‌ కొంపముచేలా ఉంది.