మరో స్కీమ్..‘సంక్షేమం’తో సేవ్..!

-

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్‌ని మించిన సీఎం లేరనే చెప్పొచ్చు. ఇప్పటివరకు ఏపీని పాలించిన సీఎంలతో పోలిస్తే జగన్..సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నెంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పథకాలు అమలు చేయడంపైనే జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని మాట తప్పకుండా అమలు చేస్తూ వస్తున్నారు.

చెప్పిన సమయానికి చెప్పిన విధంగా పథకాలు అమలు చేస్తూ…అర్హుల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. నేరుగా ప్రజల ఎకౌంట్లలోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. దీని ద్వారా ప్రజలు..పూర్తి మద్ధతు తమకే ఉంటుదనే కాన్ఫిడెన్స్ జగన్‌లో ఉంది. పథకానికి డబ్బులు ఇస్తే ప్రజలు…తమకు ఓట్లు వేసేస్తారని అనుకుంటున్నారు. అయితే పథకాలు అందిన ప్రజల్లో ఎక్కువ శాతం ప్రజలు జగన్ పట్ల పాజిటివ్ గా ఉన్నారు. అందుకే అభివృద్ధి కంటే సంక్షేమంపైనే జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇదే క్రమంలో అక్టోబర్‌లో మరో పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం అమలు చేయనున్నారు.

నిజానికి ఈ పథకం మొదట్లోనే అమలు చేయాలి. మరి ఎందుకో ఈ పథకం అమలు జరగలేదు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పథకం అమలుకు జగన్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పేరుతో ..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయనుంది. ముఖ్యంగా పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు.

ఈ పథకం కింద.. ఎస్సీ, ఎస్టీలకు 1 లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు లక్షా 20వేల రూపాయలు, బీసీలకు 50 వేల రూపాయలు, బీసీ కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు, మైనార్టీలకు లక్ష రూపాయలు, వికలాంగుల వివాహాలకు 1,50,000 రూపాయలు, భవన నిర్మాణ కార్మికులకు 40 వేల రూపాయలు సాయం చేయనున్నారు. ఈ  పథకం పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. కానీ ఎన్నికల ముందు అమలు చేయనుండటంతో…ఇందులో రాజకీయ కోణం ఎక్కువ కనిపిస్తోంది.

గత టీడీపీ హయాంలో కూడా ఈ పథకం అమలైంది. అంతకంటే ఎక్కువ ఇస్తామని జగన్ చెప్పారు. కానీ పథకం ఇప్పుడు అమలు చేస్తున్నారు. దీంతో 98 శాతం హామీలు పూర్తి అవుతాయని అంటున్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు జగన్‌ని సేవ్ చేస్తాయేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news