వైరల్ వీడియో చూసిన జగన్, పెద్ద మనసు చాటుకున్నారు…!

-

సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరికో సాయం అందుతుంది. కష్టాల్లో ఉన్న ఎందరినో సోషల్ మీడియా ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా పోస్ట్ ల కారణంగా ఎందరో కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందుతుంది. వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వాల వద్దకు వారి సమస్యలు వెళ్లి ప్రభుత్వాధినేతల ద్వారా వారికి సహాయం అందుతుంది.

కువైట్‌ దౌత్యకార్యాలయం పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి జిల్లా మహిళల దుర్బర అవస్తపై ఆంధ్రప్రదేశ్ సిఎం కార్యాలయం ముందు అడుగు వేసింది. తమ ఇబ్బందులను తెలియజేస్తూ బాధిత మహిళలు పెట్టిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఈ వీడియో ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీనిపై స్పందించిన కార్యాలయం చర్యలకు ఉపక్రమించింది.

వారి కోసం చర్యలు తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని పేర్కొంది. దీనితో రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో ‘దిశ’ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్ రంగంలోకి దిగారని, బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, కువైట్‌ ఎంబసీతో వారు సంప్రదింపులు జరపడంతో ఆ మహిళలకు విముక్తి కల్పించి, వారిని స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news