ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దారుణ హత్య.. జగన్ రియాక్షన్ ఇదీ..!

-

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేసే ఓ విలేఖరిని గుర్తు తెలియని వ్యక్తులు మాటు వేసి దారుణంగా నరికేశారు. తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న 50 ఏళ్ల కాతా సత్యనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం తేటగుంట శివారు టి.వెంకటాపురం నుంచి ఎస్‌.అన్నవరంలో తన ఇంటికి మోటార్‌ సైకిల్‌పై వస్తుండగా ఈ దారుణం జరిగింది.

సత్యనారాయణ తన ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెలుగు చూడగానే ఏపీ సీఎం జగన్ సీరియస్ గా రియాక్టయ్యారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై వెంటనే తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ తో సీఎం మాట్లాడినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది.

పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సీఐ సన్యాసిరావు, తుని రూరల్, కోటనందూరు ఎస్సైలు కేసు విచారణ చేపట్టారు. అయితే సత్యనారాయణపై హత్యాయత్నం ఇదే తొలిసారి కాదు.. స్థానికంగా ఉన్న నాయకుడి అక్రమాలు బయటపెడుతున్నందువల్ల తనను బెదిరిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది.

సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతకు ముందు ఓసారి కూడా సత్యనారాయణపై హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. రూరల్‌ పోలీసులకు సత్యనారాయణ ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news