ఏపీ డేటా చోరీ కేసు.. మంత్రి లోకేశ్ కు నోటీసులు?

-

ఆ ప్రైవేటు సంస్థ ఐటీ గ్రిడ్స్ కు అసలు ఏపీ ప్రజల డేటా ఎలా వెళ్లింది? అక్కడి నుంచి సేవా మిత్రా అనే యాప్ లోకి డేటాను ఎలా మళ్లించారు.. అనే విషయంపై తెలంగాణ పోలీసులు విచారిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అచ్చం ఫేస్ బుక్ కేంబ్రిడ్జి అనాలిటికా కుంభకోణంలానే ఉంది కదా. అవును.. ఫేస్ బుక్ కూడా తన యూజర్ల డేటాను ట్రంప్ ఎన్నికల్లో గెలవడం కోసం కేంబ్రిడ్జి అనాలిటికా అనే కంపెనీకి కట్టబెట్టిందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఏపీలోనూ అదే జరిగింది.

AP data theft case, minister nara lokesh to get notices?

వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించి.. అక్కడి నుంచి అనధికారికంగా తన సొంత యాప్ సేవా మిత్రాలోకి పంపించుకుంది టీడీపీ పార్టీ. ఈ విషయం లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

అయితే.. ఆ ప్రైవేటు సంస్థ ఐటీ గ్రిడ్స్ కు అసలు ఏపీ ప్రజల డేటా ఎలా వెళ్లింది? అక్కడి నుంచి సేవా మిత్రా అనే యాప్ లోకి డేటాను ఎలా మళ్లించారు.. అనే విషయంపై తెలంగాణ పోలీసులు విచారిస్తున్నారు. డేటా చోరి కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ దాకవరపు అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు డేటా చోరీతో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ చిక్కిల్లో పడే అవకాశం ఉంది. వీళ్లే ఏపీ ప్రజల డేటాను అనధికారికంగా ఐటీ గ్రిడ్స్ కంపెనీకి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులకు కొన్ని ఆధారాలు కూడా దొరికినట్టు సమాచారం.

అయితే.. తమ పార్టీకి చెందిన ప్రజలు, కార్యకర్తల ఓట్లను తొలగించడం కోసమే ఈ డేటా చౌర్యానికి టీడీపీ పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. తప్పు చేశారు కాబట్టే… విచారణ జరుగుతుంటేనే సీఎం చంద్రబాబు, లోకేశ్ ఉలిక్కి పడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు.

ఈనేపథ్యంలో ఏపీ ఐటీ మంత్రిగా ఉన్న లోకేశ్ కు, సంబంధిత అధికారులకు నోటీసులు పంపించడానికి సైబరాబాద్ పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే.. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ పట్టుబడితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఏతావాతా అర్థం అయ్యేదేంటంటే.. ఓటుకు నోటు కేసుతో పాటు ఈ డేటా చోరీ కేసు కూడా చంద్రబాబు మెడకు చుట్టుకోవడం ఖాయం.. ఈ కేసులో ఆయన కొడుకు లోకేశ్ కూడా ఇరుక్కోవడం కొసమెరుపు.. అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news