సర్వేల పేరిట ఓట్లు తొలగిస్తున్న వారిని వైసీపీ పోలీసులకు అప్పజెప్పిందని, అయితే వైసీపీ కార్యకర్తలపైనే పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారన్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోటంరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. కోటం రెడ్డి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కోటం రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో కోటం రెడ్డిపై కేసు నమోదైంది.
కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ్టి నుంచి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన చెప్పినట్లుగానే నెల్లూరులోని వైకాపా కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. అయితే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ కేసులను ప్రశ్నించినందుకు వైసీపీ నేతలపైనే ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. కాగా ఓ దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
తనను అరెస్టు చేయడంపై శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ… సర్వేల పేరిట ఓట్లు తొలగిస్తున్న వారిని వైసీపీ పోలీసులకు అప్పజెప్పిందని, అయితే వైసీపీ కార్యకర్తలపైనే పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారన్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోటంరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను జిల్లా కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయమూర్తి కోటంరెడ్డికి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల అనంతరం కోటంరెడ్డిని పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు.