బాబు-పవన్ కాంబోకు…జగన్-చిరు కాంబో చెక్?

-

ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ జగన్‌కు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బలంగా ఉన్న జగన్‌కు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు. ఇప్పటికిప్పుడు బాబుకు సైతం ఆ సత్తా లేదు. అందుకే బాబు వ్యూహాత్మకంగా పవన్‌ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా ఇటీవల 2009 ఎన్నికల్లో చిరంజీవి పార్టీ వల్ల తమకు ఎంత నష్టం జరిగిందో కూడా బాబు చెప్పారు. అయినా సరే చిరంజీవి తనకు మంచి మిత్రుడుని అన్నారు.

pawan kalyan chandrababuఈ పరిణామాల నేపథ్యంలో బాబుకు అనుకూలంగా రాజకీయం మారుతుంది. అటు పవన్ ఇప్పుడే పొత్తుల గురించి వద్దంటున్న సరే… కాస్త బాబు పట్ల పాజిటివ్‌గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇక పవన్ కలిస్తే కాపుల ఓట్లు వన్‌సైడ్‌గా పడిపోతాయని బాబు అంచనా…అప్పుడు టీడీపీ-జనసేనలు కలిసి వైసీపీకి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. ఈ విషయం వైసీపీకి కూడా అర్ధమవుతుంది. టీడీపీ-జనసేనలు ఎంత నష్టం కలుగుతుందో 2014 ఎన్నికల్లో తెలుసు. అలాగే రెండు పార్టీలు విడిగా ఉంటే ఎంత లాభమో 2019 ఎన్నికల్లో తెలుసు. అందుకే జగన్ సైతం వ్యూహం మర్చినట్లు కనిపిస్తోంది. బాబు-పవన్‌లు ఎలాగో దగ్గరయ్యేలా ఉన్నారు. దీంతో కాపుల ఓట్లు వైసీపీకి దూరమవుతాయి. ఇదే క్రమంలో సినిమా టిక్కెట్ల ఇష్యూ గురించి మాట్లాడాలని చెప్పి చిరంజీవిని జగన్ స్వయంగా ఆహ్వానించారు.

టిక్కెట్ల విషయమే అయితే మోహన్ బాబు, నాగార్జున ఇంకా అగ్రనటులు చాలామంది ఉన్నారు. అయినా సరే చిరంజీవి ఒక్కరినే పిలిచారంటే..దీని వెనుక రాజకీయ కోణం ఉంటుందని టీడీపీ-జనసేన శ్రేణులు అనుమానిస్తున్నాయి. పైగా జగన్‌తో భేటీ తర్వాత చిరు కూడా…జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ పరిణామాలని బట్టి చూస్తే చిరంజీవి ద్వారా…చంద్రబాబు-పవన్‌లకు చెక్ పెట్టాలని జగన్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే ఏపీ రాజకీయాలు ఆసక్తిగా సాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news