కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌నం.. కాశ్మీరం ఇక కేంద్రపాలితం

-

అంద‌రూ ఊహించిన‌ట్లుగానే జ‌రిగింది. గ‌త కొద్ది రోజులుగా జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టిక‌ల్ 370, 35ఎ ల‌ను ర‌ద్దు చేస్తార‌ని వార్త‌లు రాగా.. ఇవాళ అదే నిజ‌మైంది. గ‌త కొంత సేప‌టి క్రిత‌మే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేస్తూ రాజ్య‌స‌భ‌లో తీర్మానం చేశారు. దీంతో దశాబ్దాలుగా అమలులో ఉన్న కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తి హోదా అధికారికంగా రద్దయింది.

అంద‌రూ ఊహించిన‌ట్లుగానే జ‌రిగింది. గ‌త కొద్ది రోజులుగా జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టిక‌ల్ 370, 35ఎ ల‌ను ర‌ద్దు చేస్తార‌ని వార్త‌లు రాగా.. ఇవాళ అదే నిజ‌మైంది. గ‌త కొంత సేప‌టి క్రిత‌మే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేస్తూ రాజ్య‌స‌భ‌లో తీర్మానం చేశారు. అలాగే ఆర్టిక‌ల్ 35ఎ ర‌ద్దుకు కూడా ప్ర‌తిపాదించారు. అలాగే, జమ్ము-కాశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలను రెండు విడివిడి కేంద్రపాలిత ప్రాంతాలుగా కూడా ప్రతిపాదించారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో విప‌క్ష స‌భ్యులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. ఆర్టిక‌ల్ 370ని కాపాడాల‌ని నినాదాలు చేశారు. ప్ర‌స్తుతం స‌భ‌లో గంద‌రగోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

articles 370 and 35a Abolishment motion carried by amith shah

కాగా ఆర్టిక‌ల్ 370, 35ఎ ర‌ద్దుకు గాను చేసిన తీర్మానంపై మ‌రోవైపు అటు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కూడా సంత‌కం చేశారు. గెజిట్‌ కూడా విడుదలైంది. ఈ క్ర‌మంలోనే జ‌మ్మూ, కాశ్మీర్ ప్రాంతాలు అసెంబ్లీ ఉన్న కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా త్వ‌ర‌లో చెలామ‌ణీ కానుండ‌గా, అటు ల‌దాఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మార‌నుంది. కేంద్రం విడుదల చేసిని రాజపత్రాన్ని ఈ కింద చూడవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news