అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు… కోర్ట్ ఆర్డర్ కాపీతో స్పీకర్ ని కలువనున్న ఎమ్మెల్యేలు

-

ఈ రోజుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. తాజాగా ఈరోజు సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరారు. కోర్ట్ ఇచ్చిన ఆర్ఢర్ కాపీతో అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. అసెంబ్లీ తొలిరోజు సభకు అడ్డు తగులుతున్నారనే ఆరోపణలపై ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ను ఈ బడ్జెట్ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. ఈ వివాదంపై ఎమ్మెల్యేలు హైకోర్ట్ ను ఆశ్రయించారు. తాజాగా నిన్న హైకోర్ట్ తీర్పు వెల్లడించింది.assembly

చట్టసభల్లో సభ్యుల హక్కులను రక్షించే విషయంలో కోర్టులు కలుగచేసుకోవచ్చని చెబుతూనేే.. కీలక వ్యాఖ్యలు చేసింది. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలుజారీ చేసింది. ఈరోజు ఉదయం స్పీకర్ ని కలవాలని ఎమ్మెల్యేలకు సూచించింది. స్పీకర్ ఎమ్మెల్యేల అభ్యర్థనను వినాలని కోరింది. చట్టసభల్లో సభ్యుల ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని వ్యాఖ్యానించింది. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే సస్పెన్షన్ పై స్పీకర్ దే తుది నిర్ణయం అని కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈరోజు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news