త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుందా ? అంటే నిజమేనని తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ పునర్విభజన అనంతరం ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. జంబ్లింగ్ విధానం దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అన్ని నివేదికలు తెప్పించుకున్న కేంద్రం.. జంబ్లింగ్ విధానానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే.. కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన చేస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలపై తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లలో నియోజకవర్గాలు పెరగనున్నాయి.
ఈ లెక్కన.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 కు, ఆంధ్ర ప్రదేశ్ లోని 175 స్థానాలను 225 కు పెంచాల్సి ఉంటుంది. పునర్విభజనతో ఏపీ లోని నియోజక వర్గాల స్వరూప, స్వభావాలు పూర్తిగా మారిపోతాయి. నియోజక వర్గాల్లో ఇప్పుడున్న మండలాలు కొన్ని ఇతర నియోజక వర్గాల్లో చేరతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. పునర్విభజన చేపట్టాల్సి ఉంది. ఈ జనాభా లెక్కల ప్రకారం ఏపీలోని 13 జిల్లాల్లో 4,93,78 776 జనాభా ఉంది. అయితే… నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.