బాబాయి-అబ్బాయి రాజకీయాలు.. లాజిక్ లేకుండా ఏంటి రచ్చ….

-

తెలుగుదేశం పార్టీలో బాబాయి-అబ్బాయిలైన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మాటలకు ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాగే రాజకీయంగా వీరు ప్రత్యర్ధులపై చేసే విమర్శలు కూడా అర్ధవంతంగానే ఉంటాయి. కానీ ఈ మధ్యన ఏంటో బాబాయి-అబ్బాయిల మాటలకు లాజిక్‌లు ఉండటం లేదు. ఏ విషయమైన జగన్‌ని విమర్శించాలి కదా అనే కోణంలో బాబాయి-అబ్బాయిలు గుడ్డెద్దు చేలో పడ్డట్టు జగన్‌పై విరుచుకుపడుతున్నారు.

TDP
TDP

తాజాగా డ్రగ్స్ అంశంపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ…జగన్‌పై ఫైర్ అయ్యారు. యువతకు జగనే డ్రగ్స్ సప్లై చేస్తున్నారని, డ్రగ్స్ అలవాటు చేస్తే ఉద్యోగాలు అడగరు కదా అని మాట్లాడుతున్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడో దొరికితే దాంతో జగన్‌కు లింక్ పెట్టి మాట్లాడటం ఏంటో అర్ధం కాకుండా ఉంది. పట్టుబడిన హెరాయిన కంటైనర్ విషయంలో పోలీసులు తమ పని తాము చేసుకెళ్తారు. అలాంటప్పుడు రామ్మోహన్ లాంటి నాయకుడు కూడా గుడ్డిగా జగన్‌ని విమర్శించడం ఏంటో?

ఇక అబ్బాయి ఇలా లాజిక్ లేకుండా మాట్లాడితే బాబాయి మరొక అంశంలో ఏ మాత్రం లాజిక్ లేకుండా జగన్‌పై విమర్శలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అమలు చేస్తున్న రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, ప్రతిపక్షాలు భారత్ బంద్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ బంద్‌కు అన్నివైపులా నుంచి మద్ధతు వస్తుంది. ఈ క్రమంలోనే దీనికి టి‌డి‌పి కూడా మద్ధతు ఇచ్చింది.

భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే భారత్ బంద్‌కు మద్ధతు తెలుపుతూ రాసిన లేఖలో అచ్చెన్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ రైతు వ్యతిరేక పార్టీగా మిగిలిపోయింద‌ని, రైతులను కూలీలుగా మార్చిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమ‌ని మండిప‌డ్డారు. ఇంకా అనేక రకాలుగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అసలు బంద్ ఉద్దేశం ఏంటి? అచ్చెన్న చేసే విమర్శలు ఏంటి? అనేది ఎవరికి అర్ధం కాకుండా ఉంది. రైతులపై అంత ప్రేమ ఉంటే అచ్చెన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా లాజిక్ లేకుండా జగన్‌ని టార్గెట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news