దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మరికాసేపట్లో లక్నోలోని సీబీఐ కోర్టు తీర్పును వెలువరించనున్నది. సీబీఐ కోర్టు జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తుది తీర్పును చదివి వినిపించనున్నారు. కాగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వినయ్ కతియార్, సాక్షిమహారాజ్, ధరమ్‌దాస్, రామ్ విలాస్ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా తదితరులు కోర్టుకు చేరుకున్నారు. మొత్తం కేసుకు సంబంధం ఉన్న 32 మంది కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఆరుగురు కోర్టుకు హాజరుకావడం లేదు.
వారిలో బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, జోషి, ఉమాభారతిలు ఉన్నారు. వీరు భౌతికంగా కోర్టుకు వెళ్లడం లేదు. అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎస్‌కే యాదవ్ ఈ కేసులో తీర్పు ఇవ్వనున్నారు. మే 2017 నుంచి రోజు వారీగా యాదవ్ కేసును విచారించారు. అయితే తుది తీర్పు రోజున నేరాభియోగం ఎదుర్కొంటున్న వారంతా కోర్టులో భౌతికంగా హాజరుకావాలంటూ ఆదేశించారు. కానీ ఇవాళ ఆరుగురు కోర్టుకు హాజరు కావడం లేదు. నృత్య గోపాల్ దాస్, కళ్యాణ్ సింగ్, సతీష్ ప్రదాన్‌లు కూడా కోర్టులకు హాజరుకాలేదు.