‘పాపం అమెరికా .. ‘ మూడు  వందల సంవత్సరాల తరవాత వినపడిన మాట ఇది..!!

-

చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ వల్ల చాలా దేశాల్లో షట్ డౌన్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు ఈ వైరస్ ని ఎదుర్కొనలేక చేతులెత్తిస్తున్నాయి. ఈ వైరస్ దెబ్బకి ఇటలీ మరియు స్పెయిన్ దేశాలలో అనేక మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశంగా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఆర్థికంగా అన్ని విధాలా ఇలాంటి దేశం అయినా మట్టికరిపించి కలిగిన దేశంగా పేరొందిన అమెరికా ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.Trump creates diplomatic headache for U.K. even before state visitముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం అమెరికాలో న్యూయార్క్ అదేవిధంగా న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో బాగా ఉంది. దీంతో ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విలవిలలాడిపోతూ ఉన్నారు. ఆర్థికంగా అమెరికాకి వెన్నెముక లాంటి నగరం న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు 60 వేలమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ట్రంపు ఇప్పటికే వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో అమెరికన్లకు భారీ ప్యాకేజీ కూడా ప్రకటించారు. కానీ షట్ డౌన్ చేసే ఛాన్స్ లేదని డోనాల్డ్ ట్రంప్ తెగేసి చెపుతున్నారు. దీంతో ట్రంపు వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. మరోపక్క అమెరికా దేశంలో వైరస్ విలయతాండవం చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో పాపం అమెరికా అనే మాట మూడు  వందల సంవత్సరాల తరవాత వినబడుతుంది. 1776 లో అమెరికా కి స్వతంత్రం లేదు అప్పట్లో అనేవారు మల్లీ ఇన్నాళ్ళకి ఈ మాట వినబడింది. నిన్న మొన్నటి వరకు అగ్రరాజ్యంగా వెలుగొందిన అమెరికా ఈ స్థితికి చేరడంతో చాలా మంది అమెరికా భవిష్యత్తు ఏమైపోతుందో అని బాధ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news