బీజేపీతో కేసీఆర్: బండి చెప్పిన హాట్ న్యూస్ ఇది!

ప్రస్తుతం పాదయాత్ర మూడ్ లో ఉన్న టి.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ పై ఒక హాట్ కామెంట్ ఒకటి చేశారు. దానర్థం ఏమిటంటే… బీజేపీతో స్నేహంకోసం కేసీఆర్ ఎప్పటినుంచో ఆత్రుత చూపిస్తున్నారని! ఆ విషయంలో బీజేపీ పెద్దలు కేసీఆర్ ఆఫర్ ని తిరస్కరించారని! ఫలితంగా రాష్ట్ర రాజకీయంలో కేసీఆర్ భయపడిన ప్రతిసారీ బీజేపీ పెద్దల చుట్టూనే తిరుగుతున్నారని! అంటే… ఏపీలో చంద్రబాబులా అన్నమాట!

cm kcr bjp party

వివరాళ్లోకి వెళ్తే… తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్.. గతంలో జరిగిన జి.హెచ్.ఎం.సీ ఎన్నికల ఫలితాలు – అనంతరం కేసీఆర్ స్పందనపై స్పందించారు. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస – బీజేపీ – ఎం.ఐ.ఎం. లకు విడివిడిగా భారీ మెజారిటీలు రాలేదు. ఫలితంగా అప్పుడు బీజేపీని కలుపుకుపోవాలనే ఆలోచన చేశారంట కేసీఆర్. అనుకున్నదేతడవుగా హస్తిన వెళ్లిన కేసీఆర్.. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని బీజేపీకి ఇస్తామంటూ అమిత్ షా వద్ద ప్రతిపాదించారట.

అయితే.. ఈ ఆఫర్ ను అమిత్ షా తిరస్కరించారంట. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని, బీజేపీకి తెరాస ఆఫర్లు అవసరం లేదని తేల్చి చెప్పారంట. అంతేకాదట.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని కేసీఆర్ కు స్పష్టం చేశాడట అమిత్ షా. దీంతో… కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారంట. అంటే… బీజేపీ స్నేహం కోసం కేసీఆర్ నాటినుంచే ఆత్రుతచూపిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు బండి సంజయ్!

ఈ కామెంట్లలో ఉన్న సత్యాసత్యాల సంగతి కాసేపు పక్కనపెడితే.. నాటి జి.హెచ్.ఎం.సీ. ఫలితాలు – నేడు బండి సంజయ్ కామెంట్లకు బలం చేకూర్చేలానే ఉందని భావించాలి! ఎందుకంటే… జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ తరహా పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం మూడు పార్టీలకు మెజార్టీ సీట్లు రాలేదు.

అంటే… ఏపీలో టీడీపీకి కష్టం వచ్చిన ప్రతిసారీ – హస్తిన వెళ్లి బీజేపీపెద్దల వద్ద బాబు చేసిన రాజకీయమే.. తెలంగాణలో తెరాసకు కష్టం వచ్చినప్పుడు కేసీఆర్ కూడా చేశారన్న మాట! అయితే.. హస్తిన పెద్దలు బాబుకు రెండు సార్లు అవకాశం ఇచ్చారే తప్ప.. కేసీఆర్ కు ఒక్కసారి కూడా ఇవ్వలేదన్నమాట!

ఫలితంగా… ఈ కామెంట్లు చేయడం వల్ల కేసీఆర్ హస్తిన టూర్ పై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చినట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! దీనితోపాటు… బీజేపీతో కలవాలనే ఆత్రుత కేసీఆర్ కు ఉందితప్ప… కేసీఆర్ తో కలవాలనే సరదా బీజేపీ పెద్దలకు లేదు అని స్పష్టం చేసే ప్రయత్నం కూడా చేశారు బండి సంజయ్!

-CH Raja