మర్రిని దువ్వుతున్న బండి..లాగేస్తారా?

-

కాంగ్రెస్ పార్టీలో ఉండే అసంతృప్తి నాయకులని బీజేపీలోకి లాగే విషయంలో బండి సంజయ్ చాలా తెలివిగా రాజకీయం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తే చాలు…వారిని బండి పొగుడుతున్నారు…అలాగే బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. మామూలుగానే కాంగ్రెస్ లో లుకలుకలు ఎక్కువనే సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు..తమ పార్టీలో అంతర్గతంగా జరిగే అంశాలని బహిరంగంగా మాట్లాడతారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తారు. ఈ మధ్య కాంగ్రెస్ సీనియర్లు…రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక అలా విమర్శలు చేసే నేతలని దువ్వడం బండి పని అయిపోయింది…వారిని నిదానంగా దువ్వి…బీజేపీలో చేరేలా చేసుకుంటున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి లాగారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైతం బీజేపీలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకట రెడ్డి ముందు నుంచి రేవంత్ పై ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇక ఈయన తమతో టచ్ లో ఉన్నారని, వెంకటరెడ్డి మా మనిషే అని మాట్లాడి బండి కొత్త చర్చకు దారితీశారు.

త్వరలోనే వెంకటరెడ్డి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది…ఇక ఆ మధ్య కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్…ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ పై విమర్శలు చేశారు. ఇంకా అంతే…శ్రవణ్ మంచోడు అని, తనని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నానని బండి అన్నారు. నెక్స్ట్ డే శ్రవణ్ బీజేపీలో చేరిపోయారు.

ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి…రేవంత్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లో కల్లోలానికి రేవంత్ కారణమని, రేవంత్ వైఖరి వల్లే సీనియర్లు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారని అన్నారు. ఇలా మాట్లాడిన కొన్ని గంటల్లోనే బండి సంజయ్ స్పందించారు.. కాంగ్రెస్ లో మర్రి శశిధర్‌ రెడ్డి సిన్సియర్‌ అని, ఆయనే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని, పద్ధతిగా ఉండే మర్రి శశిధర్‌ రెడ్డి కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే కాంగ్రెస్‌ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. అంటే మర్రి సిన్సియర్ అని ఆయన్ని పొగుడుతూ…మెల్లగా బీజేపీలోకి లాగడానికి చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి బండి చాల స్మార్ట్ గా రాజకీయం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news