వారిని చెడామడా తిట్టేస్తున్న ‘ బండి ‘ ? ఓహో అసలు ప్లాన్ ఇదా ?

-

తెలంగాణలో బిజెపి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి టిఆర్ఎస్ ను బలహీనం చేసే అన్ని విషయాల పైన దృష్టి పెట్టి బలం పెంచుకునేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళుతోంది ఏ ఏ అంశాల ద్వారా టిఆర్ఎస్ పై చేయి సాధించిందో అవే అంశాలను టార్గెట్ చేసుకుని టిఆర్ఎస్ కు పట్టు దొరక్కుండా, బలహీనం చేయాలనే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న తీరు దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. బండి సంజయ్ వ్యాఖ్యలు టీఎన్జీవో నేతల్లోనూ రాజకీయ వర్గాలలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ఏవిధంగా విమర్శలు చేస్తున్నారో, టీ ఎన్జీవో నేతల పైన సంజయ్ అదే విధంగా విమర్శలు చేస్తున్నారు .

ఇటీవల ఢిల్లీలో పెద్దఎత్తున రైతులు ఆందోళనకు దిగడం, భారత్ బంద్ కు పిలుపునివ్వడం, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడంపై బిజెపి ఆగ్రహంగా ఉంది. కెసిఆర్ పిలుపు మేరకు ఉద్యోగులు బందులో పాల్గొంటారని టీఎన్జీవో నేతలు ప్రకటించడంపైనా మండిపడుతున్నారు. అసలు రైతుల సమస్యలకు ఉద్యోగ సంఘాల కు సంబంధం ఏంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల సమస్యలను పట్టించుకోకుండా… ఉంచుకున్న వాళ్ళు పెంచుకున్న వాళ్ల కోసం జీవోలు తెచ్చుకుంటున్నారు అంటూ టీఎన్జీవో నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీఎన్జీవో పదవులను అడ్డంపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడా పెడుతున్నారని, వారి సంగతి త్వరలోనే తేల్చు తాము అని బిజెపి నేతలు బహిరంగంగా విమర్శలు చేయడం వెనక ఒక ప్రణాళిక ఉన్నట్లుగా అర్థం అవుతోంది.

మామూలుగా అయితే ఉద్యోగ సంఘాల మద్దతు కోసం అన్ని పార్టీలు గట్టిగా ప్రయత్నం చేస్తుంటాయి. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు బిజెపి వ్యవహరిస్తుండడం పై ఉద్యోగ సంఘాలలో చర్చ జరుగుతోంది. అయితే గతంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన స్వామిగౌడ్ బిజెపిలో చేరడం తో ఇప్పుడు టిఎన్జీవో సంఘం లో చీలిక తెచ్చే విధంగా బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. స్వామి గౌడ్ తో పాటు , ఉద్యోగ సంఘానికి చెందిన మరో మాజీ నేత తో కలిసి ఉద్యోగ సంఘాలలో చీలిక తీసుకువచ్చి, బీజేపీకి మద్దతు లభించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అది కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోవడంలేదని, అలాగే టీఎన్జీవో నేతలు ప్రభుత్వం దగ్గర ఉద్యోగ సమస్యలను ప్రస్తావించి పరిష్కార మార్గం చూపించడంలో విఫలమవుతున్నారని చాలా కాలంగా ఉద్యోగుల్లో ఆగ్రహం ఉండటంతోనే ఇప్పుడు ఆ సంఘాలలో చీలిక తెచ్చి ఉద్యోగుల మద్దతు బీజేపీకి ఉండేవిధంగా సంజయ్ ప్లాన్ చేస్తున్నట్లు గా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news