తెలంగాణ జనసేన అధ్యక్షుడిగా బండ్ల గణేష్?

ఎప్పుడూ ఏదో ఒక వార్తతో టీవీ ఛానల్స్ లో హాట్ టాపిక్ గా ఉంటారు తెలుగు సినీ పరిశ్రమ నిర్మాత, బండ్ల గణేష్. మొన్నటి వరకు మా అధ్యక్ష ఎన్నికల్లోనూ బండ్ల గణేష్… హైలెట్ అయ్యారు. ఇక ఇప్పుడు జన సేన పార్టీ గురించి ట్వీట్ చేసి.. మళ్ళీ వార్త ల్లోకి ఎక్కారు బండ్ల గణేష్. తాజాగా తెలంగాణ జన సేన అధ్యక్షుడు బండ్ల గణేష్ అవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

అంతే కాదు త్వర లోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇవాళ ఉదయం నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్విట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం లో కూడా జన సేన ఓ మహా శక్తి గా అవతరిచబోతుంది అంటూ బండ్ల గణేష్ ట్విట్ చేశారు “తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది” అంటూ బండ్ల గణేష్ ట్విట్ చేయడం తో అందరూ.. తెలంగాణ జన సేన అధ్యక్షుడు బండ్ల గణేష్ అవుతున్నట్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాగా బండ్ల గణేష్.. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.