రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి , పార్టీకి అవసరం: బట్టి విక్రమార్క

-

దేశ రక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి, దేశానికి అవసరం అని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క అన్నారు. రాహుల్, సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ సీఎల్పీ తీర్మాణం చేసింది. ఈ తీర్మాణాన్ని అధిష్టానానికి పంపుతామని అన్నారు. కపిల్ సిబల్ వంటి నేతలు  గాంధీ నాయకత్వాన్ని వద్దనడం సరైనది కాదని ఆయన అన్నారు. సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, మత ఛాందస భావలతో, మతతత్వ వాదనలతో జాతిని విచ్ఛినం చేసే కుట్ర జరుగుతోంది… లౌకిక వాదంతో కూడినటువంటి స్వాతంత్య్ర భావనలు కాపాడేందుకు రాహుల్ గాంధీ అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని ఆయన కోరారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని ఆయన బట్టి అన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. సోనియా గాంధీ వలుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ భావజాలం కాపాడి ప్రాణ త్యాగాలు చేసింది గాంధీ కుటుంబమే అని ఆయన అన్నారు. కపిల్ సిబల్ గాంధీ ఫ్యామిలీ త్యాగాాలతోనే పదేళ్లు మంత్రిగా పనిచేశారని బట్టి విమర్శించారు. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం రాహుల్ గాంధీ నాయకత్వం కోసమే అని బట్టి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news