నల్గొండలో బీసీ సీటు ఏది? కాంగ్రెస్‌లో రెడ్లకు చిక్కులు.!

-

తెలంగాణలో బి‌సి సామాజికవర్గం ప్రజలు అత్యధికంగా ఉంటారనే సంగతి తెలిసిందే. బి‌సిల ఓట్లు ఎక్కువ..వారు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. అందుకే రాజకీయ పార్టీలు వారి మద్ధతు పొందడానికి ప్రయత్నిస్తుంటాయి. బి‌సిలకు ప్రత్యేక హామీలు ఇస్తారు. ఇదే క్రమంలో ఈ సారి ఎన్నికల్లో బి‌సిలని ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. మామూలుగా కాంగ్రెస్ అంటే రెడ్డి సామాజికవర్గం హవా ఉన్న పార్టీ. ఆ పార్టీలో బి‌సిలకు అనుకున్న మేర ప్రాధాన్యత దక్కడం లేదు.

ఈ నేపథ్యంలో బి‌సిల ఓట్లని ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ బి‌సి మంత్రం జపిస్తుంది. ప్రత్యేకంగా బి‌సిల కోసం డిక్లరేషన్ ప్రకటించడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే బి‌సిలకు ప్రతి పార్లమెంట్ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే 17 పార్లమెంట్ సీట్లు ఉంటే..మొత్తం 34 అసెంబ్లీ సీట్లు బి‌సిలకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఈ నిర్ణయం బాగానే ఉంది..కానీ అమలు చేసే సరికి ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని పార్లమెంట్ పరిధిల్లో వేరే బి‌సిలకు సీట్లు ఇచ్చి ఆప్షన్ కనిపించడం లేదు.

ఈ క్రమంలోనే నల్గొండ పార్లమెంట్ పరిధిలో బి‌సిలకు అసలు అవకాశం దొరికేలా లేదు. ఈ పరిధిలో నాగార్జునసాగర్, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, దేవరకొండ, మిర్యాలగూడ స్థానాలు ఉన్నాయి. ఇందులో దేవరకొండ ఎస్టీ రిజర్వడ్..ఇది పక్కన పెడితే మిగిలిన సీట్లు జనరల్..వాటిల్లో రెండు బి‌సిలకు ఇవ్వాలి. కానీ అది సాధ్యమయ్యే పనిలా లేదు.

ఎందుకంటే నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో పద్మావతి, జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి..మిర్యాలగూడ సీటు కోసం, చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. అటు సూర్యాపేట సీటులో దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఆరు సీట్లలో రెడ్డి వర్గం నేతలే ఉన్నారు. దీంతో బి‌సిల కోసం అవసరమైతే తన సీటు త్యాగం చేస్తానని కోమటిరెడ్డి అంటున్నారు. కానీ అంత తేలికగా కోమటిరెడ్డిని తప్పించే ఛాన్స్ లేదు. దీంతో నల్గొండ పరిధిలో బి‌సిలకు సీట్లు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news