ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు లోకల్ ఎలక్షన్ ఈనెల చివరి లోపు కంప్లీట్ చేయకపోతే ఆర్థిక సంఘం నుండి రావలసిన కొన్ని కోట్లు ఆగిపోతాయి అంటూ ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడంతో ఎన్నికలకు రెడీ అయ్యింది జగన్ సర్కారు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలను బలి తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది.మొన్నటి వరకు లోకల్ ఎలక్షన్ నేపథ్యంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి రాబోతున్న తరుణంలో ఎన్నికలు వాయిదా పడటం ఇప్పుడు ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతని డైరెక్షన్లోనే పనిచేస్తున్నట్లు వైసిపి నాయకులు ఎన్నికలు వాయిదా వేయడాని తప్పుబట్టారు. అయితే ఎన్నికలు వాయిదా పడటానికి గల కారణం చూస్తే మోడీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళితే చాలా చోట్ల బలవంతంగా టిడిపి జనసేన బిజెపి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసిపి అడ్డుకోవడం, ఇవి మీడియాలోనూ ప్రచారం కావడంతో వైరల్ గా మారాయి. ముఖ్యంగా మాచర్లలో బీజేపీ పార్టీ అభ్యర్థులను కూడా వైసిపి నాయకులు తరిమికొట్టే వీడియోలు బయటపడటంతో…స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం లో మోడీ పాత్ర కూడా ఉన్నట్లు, ఆ వీడియోలు మోడీ దృష్టి దాకా వెళ్లినట్లు కొత్తగా ఏపీలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతం జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.