భూమా ఫ్యామిలీ ఇక టీడీపీ నుంచి వెళ్ళినట్టే…?

-

తెలుగుదేశం పార్టీ నుంచి కర్నూలు జిల్లాలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కుటుంబం అలాగే భూమా అఖిలప్రియ కుటుంబం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో కొన్ని రోజులుగా ఈ రెండు కుటుంబాల ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల పార్టీ నుంచి బయటకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

tdp

భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఆమె సోదరి మౌనిక కూడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయటం లేదు. ఇక ఇటీవల హైదరాబాదులో ఒక వివాదంలో ఆమె ఇబ్బంది పడ్డారు. ఇక ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా సహకారం రాలేదు. తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు నేతలు మినహా ఆమెకు సహకారం అందించలేదు.

అందుకే ఇప్పుడు భూమా అఖిలప్రియ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని సమాచారం. భూమా కుటుంబం ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నా ఆ తర్వాత కొన్ని పరిణామాలతో వేరే పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే 2017లో మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు భూమా అఖిలప్రియను పర్యాటక శాఖ మంత్రిగా చేశారు. అప్పట్లో పనితీరుపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా ఆమె పనితీరుపై తెలుగుదేశం పార్టీలో అసహనం వ్యక్తం అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. అందుకే వారు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news